in

beauty mrunal thakur ignoring telugu movies?

సీతారామం’ తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన మృణాల్ ఠాకూర్..ఫస్ట్ మూవీతోనే భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’తో సెకండ్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దగుమ్మకు ‘ఫ్యామిలీ స్టార్’ రూపంలో హ్యాట్రిక్ మిస్సయ్యింది. మళ్ళీ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘కల్కి’లో జస్ట్ క్యామియోతో సరిపెట్టేసింది. ‘కల్కి’ తర్వాత మృణాల్ తెలుగు ఆడియన్స్ కు దూరంగా ఉంటోంది.

ఆఫర్లు రావట్లేదో లేదో వద్దనుకుంటుందో లేక కథ నచ్చట్లేదో కానీ టాలీవుడ్‌లో ఆమె కొత్త ప్రాజెక్ట్ గురించి అప్డేట్ రావడానికి ఏడాది సమయం పట్టింది. ఇటీవల, మృణాల్ అడివి శేష్ ‘డెకాయిట్’ సినిమాకు కమిట్ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఎక్కువగా బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదు సినిమాలుండగా, వాటిలో నాలుగు హిందీ చిత్రాలు కావడం గమనార్హం..!!

Balakrishna: The Legend – Experience the Power, Passion, and Legacy!

Boyapati planning something big for ‘Akhanda 2’