వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న రష్మిక..ఇటీవలే జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా తన గాయం గురించి తెలియజేస్తూ..కాలికి కట్టు కట్టుకుని ఉన్న ఫొటోని ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. అంతేకాకుండా గాయం మానడానికి ఎంత సమయం పడుతుందో తెలియదన్నారు. ఈ మేరకు పోస్ట్ లో..”
నూతన సంవత్సర శుభాకాంక్షలు! నేను ఎంతో పవిత్రంగా భావించే జిమ్‌లో గాయపడ్డాను. పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలి. త్వరగా కోలుకుని ‘సికందర్’, ‘థామ’, ‘కుబేర’ సెట్స్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నా. ఈ ఆలస్యానికి క్షమించాలని ఆయా చిత్రాల దర్శకులను కోరుతున్నా. నా కాలు ఏమాత్రం సెట్ అయినా వెంటనే షూట్లో భాగం అవుతా..” అని రాసుకొచ్చారు.