వరసగా భారీ మూవీస్ తో రాబోతున్నాడు నిఖిల్ సిద్దార్థ్. కార్తికేయ 2తో ప్యాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేసుకున్న నిఖిల్..ఈ సారి వరుసగా స్వయంభు అనే ఫిక్షనల్, ది ఇండియా హౌస్ అనే హిస్టారికల్ మూవీస్ తో రాబోతున్నాడు. రీసెంట్ గా ఎప్పుడో రూపొందిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంతో వచ్చాడు. బట్ ఈ మూవీ డిజాస్టర్ అయింది..
అయినా అతను ఈ చిత్రాన్ని అసలు పట్టించుకోలేదు. కాకపోతే స్వయంభూ, ది ఇండియా హౌస్ మూవీస్ డూ ప్యాన్ ఇండియా ఆడియన్స్ టార్గెట్ గా రూపొందుతుున్నవే కావడం విశేషం. మరో విశేషం ఏంటంటే..వీటిలో ది ఇండియా హౌస్ అనే చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమర్పిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తోన్న ఈ మూవీలో నిఖిల్ సరసన హీరోయిన్ మేజర్ ఫేమ్ సాయీ మంజ్రేకర్ నటిస్తోంది..!!