రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ రేంజ్ లో మరోసారి తెలుగు సినిమా సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. ఏకంగా హాలీవుడ్ మార్కెట్ కబ్జ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఈ క్రమంలో..సినిమా కోసం హాలీవుడ్ నుంచి స్టార్‌నటులను మాత్రమే కాదు హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను కూడా రంగంలోకి దింపుతున్నాడు. ఇప్పటికే తోర్ మూవీ..హీరో క్రిస్ హేమ్ బర్త్ ఈ సినిమాలో కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్..
అంతేకాదు ఈ సినిమా కోసం మరో ప్రముఖ హాలీవుడ్ స్టార్‌ను రాజమౌళి తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడట. గ్రావిటీ సినిమాలో ఆమె నటించినందుకు గాను ఏకంగా రూ.600 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంది. ఆమె పేరే సాండ్రా బుల్లక్. హాలీవుడ్లో హీరోయిన్గా, క్యారెక్టర్ అర్టిస్ట్‌గా, విలన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించినా సాండ్రా బుల్లక్..రాజమౌళి సినిమాలో నటించబోతుందని తెలుస్తుంది. ఇక దాదాపు రూ.1200 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నెల నుంచి షూటింగ్ ప్రారంభం కాదట..!!