in

bollywood producers want sreeleela as item girl!

పుష్ప 2 లో శ్రీలీల చేసిన ‘కిస్సిక్’ సాంగ్ మంచి ఆదరణ పొందింది. ఎందరో బాలీవుడ్ ముద్దుగుమ్మలు పేర్లు పరిశీలించి చివరికి శ్రీలీల కి ఓటేశారు సుకుమార్. ఆ నమ్మకం నిలబెట్టింది శ్రీలీల. ఒక్క పాటతో కమ్ బ్యాక్ ఇచ్చింది. వరుస సినిమాలు ఆఫర్స్ తో పాటు, బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ కోసం కూడా శ్రీలీలని అప్రోచ్ అవుతున్నారట. కారణం శ్రీలీల మంచి డాన్సర్, ఎక్సప్రెషన్ క్వీన్, అదిరిపోయే ఫిజిక్. ఇవన్నీ బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చేలా చేస్తున్నాయి. కిస్సిక్ పాటలో ఎక్స్ ప్రెష‌న్స్, హిప్ మూవ్ మెంట్స్ అన్నీ ప‌ర్పెక్ట్ గా ఉన్నాయి.

కిస్సిక్ పాట చూసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ శ్రీలీల కోసం అవకాశాలు సృష్టిస్తున్నారట. బాలీవుడ్ లో ఎప్పటి నుంచో పాగా వేసి ఉన్న ఐటెం గర్ల్స్ మ‌లైకా అరోరా, జాక్వెలిన్ పెర్నాండేజ్, నోరా ప‌టేహీ, కరీనా, కత్రినా లాంటి వాళ్ళని కాదని శ్రీలీల వెంట పడుతున్నారట. ఇప్పటికే రెండు బడా ప్రొడ‌క్ష‌న్ హౌసెస్ నుంచి ఐటెం సాంగ్స్ కోసం శ్రీలీలని  అప్రోచ్ అయిన‌ట్లు టాక్. ఇక శ్రీలీల కెరీయర్ యూటర్న్ తీసుకున్న‌ట్లే. ఎందుకంటే బాలీవుడ్ లో ఐటం సాంగ్స్ కి ఉన్నంత క్రేజ్ నార్మల్ గీతాలకి కూడా లేదు..!!

HAPPY BIRTHDAY AADHI!