నందమూరి వంశం నుంచి మూడో తరం హీరోగా వస్తున్నాడు బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ. ఇప్పటికే ఆయన లుక్స్ అభిమానులను అలరించాయి. మోక్షజ్ఞను తెరంగేట్రం చేయించే బాధ్యతను ‘హను-మాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు అప్పగించారు బాలకృష్ణ. ప్రశాంత్ వర్మ కూడా ఈ ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నట్టు ప్రకటించారు.
అయితే..ఇటివల ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై బాలకృష్ణ కూడా స్పందించి..మోక్షజ్ఞకు జ్వరం రావడంతో కాస్త ఆలస్యమైందని అన్నారు. అయినా కూడా పుకార్లు ఆగకపోవడంతో దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ‘ఎస్ఎల్వీ సినిమా’ స్పందించి సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. సినిమాపై కొన్ని గాసిప్స్ వచ్చాయి. అవేవీ నిజం కాదు. ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా @SLVCinemsOffi @LegendProdOffi అఫిషియల్ ఖాతాల నుంచి విడుదల చేస్తాం. పుకార్లు నమ్మొద్ద’ని ప్రకటన విడుదల చేసి ఊహాగానాలకు చెక్ పెట్టింది..!!