ప్రశాంత్ వర్మ ప్రభాస్ తో చేయబోయే సినిమాపై దృష్టి సారించాడట. అదేంటి ప్రభాస్ ఫుల్ బిజీ కదా, ఎప్పుడు డేట్స్ ఇస్తాడు ప్రశాంత్ వర్మ ఎప్పుడు సినిమా తీయాలని ప్రశ్నిస్తున్నారు. ముందు నుంచి ప్రభాస్, ప్రశాంత్ కాంబోలో ఓ సినిమా వస్తుందని ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పడు మోక్షజ్ఞ మూవీ ఆగిపోవడంతో ప్రభాస్ సినిమాపై వర్క్ చేస్తున్నాడట ప్రశాంత్..
అంతే కాదు అందరినీ సర్ప్రైజ్ చేసే న్యూస్ కూడా వినిపిస్తోంది. జనవరిలో ప్రభాస్ తో మూవీ అనౌన్స్ చేస్తాడట ప్రశాంత్. మొన్నటి వరకు హోంబలే ప్రొడక్షన్ లో ప్రభాస్ సినిమాకి రిషబ్ శెట్టి కథ అందిస్తారని ప్రచారం జరిగినా, ఇప్పడు ప్రశాంత్, ప్రభాస్ కాంబో మూవీకి రిషబ్ శెట్టి కథ అందిస్తున్నాడని సమాచారం. కానీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోనే ఈ కథ కూడా ఉంటుందని తెలుస్తోంది..!!