వీళ్ళ సినిమా తొందర్లోనే స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సినిమాల్లో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అల్లు అర్జున్ కూడా ఈ విషయం మీద త్రివిక్రమ్ కు పూర్తి బాధ్యత అప్పగించినట్లు సమాచారం. దీంతో.. మీనాక్షి చౌదరిని మెయిన్ హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్.. ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉండేలా కథను రాసుకున్నాడని తెలుస్తుంది..
మరి రెండవ హీరోయిన్ ఎవరిని తీసుకుంటున్నారు అనే దానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్‌తో మీనాక్షి చౌదరికి మంచి ఇమేజ్ ఏర్పడింది. దీంతో ఆమెకు తెలుగులోనే కాదు మలయాళ, తమిళ్ ఇండస్ట్రీలోనూ మార్కెట్ ఉంది. ఈ క్రమంలోనే మీనాక్షి చౌదరిని తీసుకుంటే ఇక్కడ ఇండస్ట్రీలలో సినిమాకు మరింత ప్లస్ అవుతుందని చాలా వరకు మార్కెట్ విషయంలో కూడా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో త్రివిక్రమ్..మీనాక్షిని ప్రిఫర్ చేస్తున్నట్లు సమాచారం..!!