సినిమా రిలీజ్ అయిన వారం రోజుల లోపే వెయ్యి కోట్లు మార్క్ దాటేసింది. దీనితో సుక్కు రేంజ్ మరింత పెరిగింది. నెక్స్ట్ సుకుమార్ ఎవరితో వర్క్ చేస్తాడు అన్న ఆసక్తి పెరిగింది. పుష్ప 2 తరువాత సుకుమార్ చరణ్ తో వర్క్ చేస్తాడని ప్రచారం జరిగింది. చరణ్ కూడా అప్పటికి RC16 కంప్లీట్ చేసి సుక్కు ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతాడని అనుకున్నారంతా. కానీ సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చెర్రీతో కాదంట.
చెర్రీతో వర్క్ చేయటానికి కంటే ముందే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం ఒక డాక్యుమెంటరీ చేయనున్నారని టాక్. ట్విస్ట్ ఏంటి అంటే అది కూడా ‘పుష్ప’ స్టోరీ. అదేంటి ఇప్పటికే రెండు పార్ట్ లు తీశారు. ఇంకా మూడో పార్ట్ ఉంది. మళ్ళీ పుష్ప స్టోరీ ఏంటి అనుకుంటున్నారా? పుష్ప మూవీకి వర్క్ చేస్తున్నపుడు సుకుమార్ చాలా రీసెర్చ్ చేసారంట. కష్టపడి సేకరించిన విషయాలు అలా నిరర్థకంగా పడేయటం ఎందుకని నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం ఉపయోగిస్తున్నారు..!!