టాలీవుడ్ లో జక్కన్న తర్వాత ఆ స్థాయిలో సినిమాను తీయగలిగే డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు సుకుమార్. ఆయనతో సినిమా చేస్తే కచ్చితంగా మార్కెట్, క్రేజ్ పెరుగుతాయని హీరోలు నమ్ముతున్నారు. దీంతో సుకుమార్ తర్వాత సినిమా ఎవరితో చేస్తారనే ప్రచారం జరుగుతోంది. చాలా రోజులుగా రామ్ చరణ్ తో ఉంటుందని అంటున్నారు. ఇక తాజాగా ఈ విషయం మీద క్లారిటీ వచ్చేసింది. సుకుమార్ టీమ్ లో రైటర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడు..
ఇప్పటికే రామ్ చరణ్ తో ఓ సిట్టింగ్ అయిందని.. ఇద్దరూ ఓ మాట అనేసుకున్నట్టు హింట్ ఇచ్చాడు. పుష్ప-2 తో సుకుమార్ చాలా అలసిపోయాడని.. కాబట్టి చిన్న వెకేషన్ బ్రేక్ తీసుకుంటాడని అన్నాడు. ఆయన వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత రామ్ చరణ్ తో సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చేస్తుందని చెప్పుకొచ్చాడు. దాంతో ఆయన వ్యాఖ్యలను బట్టి కచ్చితంగా రామ్ చరణ్ తోనే తర్వాత సినిమా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే సుకుమార్-రామ్ చరణ్ కాంబోలో రంగస్థలం మూవీ వచ్చింది..!!