అడయార్ సిగ్నెల్ వద్ద ఎనిమిదేళ్ల బాలుడు డబ్బులు అడిగాడు. ఉచితంగా డబ్బులు ఇచ్చేందుకు నా మనసు అంగీకరించలేదు. దీంతో రూ. 50 విలువైన పుస్తకాన్ని కొనాలని చెప్పడంతో రూ. 100 నోటు తీయగా, ఆ బాలుడు రూ. 500 అడిగాడు. దీంతో పుస్తకాన్ని బాలుడికి తిరిగి ఇచ్చి, నేను ఇచ్చిన రూ.100 నోటు వెనక్కి తీసుకున్నాను. అయితే, ఆ పిల్లవాడు పుస్తకాన్ని కారులో పడేసి… చేతిలోని రూ.వంద నోటు లాక్కొని పారిపోయాడు’ అని పేర్కొంది.
ఇది చాలా సిగ్నల్స్ వద్ద జరుగుతున్న విషయమే. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఒకటి వైరల్ అవుతుంటుంది. వాటర్ బాటిల్స్ అమ్మే అతను..ఒక కారు దగ్గర నిలబడి మూత తీయడానికి ప్రయత్నించగా.. ఆ మూత రాకపోవడంతో, కారులోని యువతి ఆ బాటిల్ తీసుకుని మూత తీసి సదరు వ్యక్తికి ఇవ్వబోగా..రూ. 20 ఇవ్వాలని అతను చెప్పడంతో చేసేది లేక ఆమె రూ. 20 చెల్లించుకుంటుంది. ఇలాంటి మోసాలు ప్రతి రోజూ చాలా అంటే చాలానే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నివేదా పేతురాజ్ కూడా అలాంటి మోసానికే గురయింది..!!