in

Harish Shankar to work with ismart hero ram!

త్వరలో రామ్ తో హరీష్ ఒక సినిమా చేస్తున్నట్లు, కొమ్మలపాటి కృష్ణ ప్రొడ్యూసర్ గా ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారని చెప్తూ,  నేను వర్క్  చేయాలనుకున్న హీరోకి వ్యతిరేకంగా నా సినిమా ఎందుకు రిలీజ్ చేస్తా అని హరీష్ పేర్కొన్నారు. తప్పని సరి పరిస్థితులలో ఇలా పోటీ పడాల్సి వస్తోందని, రామ్, పూరి లకి డబుల్ ఇస్మార్ట్ మంచి హిట్ ఇవ్వాలని కోరారు హరీష్. హరీష్ శంకర్ పవన్ తో ఉస్తాద్ భగత్ తెరకెక్కిస్తున్నాడు..

ఈ మూవీ గ్యాప్ రావటం తో రవితేజతో మిస్టర్ బచ్చన్ పూర్తి చేసాడు. నెక్స్ట్ పవన్ డేట్స్ ఇస్తే ఉస్తాద్ భగత్ కంప్లీట్ చేసి రామ్ తో మూవీ పట్టాలెక్కిస్తాడని సమాచారం. రామ్ కూడా డబుల్ ఇస్మార్ట్ తరవాత ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాడని ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు హరీష్ ప్రకటనతో రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆసక్తి పెరిగింది. హరీష్ లాంటి మాస్ డైరక్టర్ తో రామ్ లాంటి ఎనర్జిటిక్ హీరో సినిమా అంటే ఫాన్స్ ఎక్సపెక్టేషన్స్ పెంచినట్టే..!!

Balakrishna’s son Mokshagna’s debut film confirmed?

25 Years Of MAHESH BABU In Tollywood Film Industry🔥