in

Keerthy Suresh responds on her marriage rumors!

కొద్ది రోజులుగా కీర్తి సురేష్ త‌న చైల్డ్ హుడ్ ఫ్రెండ్‌తో ఏడ‌డుగులు వేయ‌నుందంటూ అనేక ప్ర‌చారాలు సాగాయి. వీరిద్దరు గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఆ ప్ర‌చారాల‌పై కీర్తి తాజాగా స్పందించింది. సోషల్ మీడియాలో నా గురించి వైరల్ అవుతున్న రూమర్స్‌పై క్లారిటీ ఇస్తే అవి నిజమనే నమ్ముతారు. అందుకే అలాంటి రూమర్స్‌పై నేను స్పందించనంటూ కీర్తి చెప్పుకొచ్చింది.

కేవలం నా సినిమాల ఎంపిక.. నటనపై విమర్శలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తాను. ఇక నా వ్యక్తిగత జీవితం..ఫ్యామిలీ గురించి ఎవరైనా కామెంట్స్ చేసినా కూడా నేను ఏ మాత్రం పట్టించుకోను.. వాళ్ల వ్యక్తిగత కారణాలతో చేసే కామెంట్స్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటూ తన పెళ్లి వార్తలను కొట్టిపారేసింది కీర్తి సురేశ్. ప్రస్తుతం తన దృష్టాంతా కూడా సినిమాలపైనే ఉందని, పెళ్లి చేసుకుంటే మాత్రం అంద‌రికి చెప్పి చేసుకుంటానంటూ కీర్తి కామెంట్ చేసింది..!!

Ban Threat Issued On Tamil Hero Vishal Movies!

Bobby Deol To Play Villain Role In ‘Devara’.