in

senior actor Nassar to teach dialect skills to Mahesh Babu!

SSMB29 సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందని, స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిపోయిందని, మ్యూజిక్ వర్క్ కూడా మొదలు పెట్టారని సమాచారం. షూటింగ్ షెడ్యూల్ ఈ ఏడాది లోనే స్టార్ట్ కానుందట. ఈ నేపథ్యం లోనే  మహేష్ బాబు ఈ మూవీకి కావాల్సిన శిక్షణ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అది ఎవరి దగ్గర అంటే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో నటించి పాన్ ఇండియా యాక్టర్ గా పేరు తెచుకున్న నాజర్ దగ్గరని సమాచారం.

జక్కన్న మహేష్ పాత్రని విభిన్నంగా తెరకెక్కిస్తున్నాడు. అందువల్ల భాష, యాస, హావ భావాలు ఎలా ఉండాలన్న దానిపై సీనియర్ నటుడు నాజర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. నాజర్ మహేష్ కలిసి ఇప్పటికే పలు ప్రాజెక్ట్ లలో కలిసి నటించారు. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆ చనువు ఇప్పుడు ఇలా కెరియర్ కి ఉపయోగపడింది. ఇంతకు ముందు నాజర్, ప్రభాస్ కి కూడా నటనలో మెళకువలు నేర్పినట్లు తెలిసిందే. మహేష్ లాంటి  స్టార్ హీరో నాజర్ దగ్గర మెళకువలు నేర్చుకోవటానికి వెళ్ళటం గొప్ప విషయమే..!!

animal villain in jr ntr’s devara?

Indian 2 result impact Game Changer!