10. 30 WEDS 21
కొంచమన్న పాపులారిటీ లేని కొత్త నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఊహించని క్రేజ్‌ను సంపాదించుకొంటున్నారు..అలాంటి కోవలో అంతా కొత్తవారు కలిసి చేసిన ప్రయత్నం 30 Weds 21 వెబ్ సిరీస్..తన తండ్రి కోరిక మేరకు ఏజ్ గ్యాప్ ఉన్న పృథ్వీని పెళ్లి చేసుకొన్నాననే భావనలో మేఘన తమ కాపురాన్ని ముందుకు తీసుకోలేక..ఏటు తేల్చుకొని ఓ సందిగ్ధంలో ఉండిపోతారు..అదే ఇందులో మెయిన్ స్టోరీ!!
09. INSPECTOR RISHI
ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్‌కు నందిని జేఎస్ దర్శకత్వం వహించారు. అడవిలో జరిగే వరుస హత్యలను ఛేదించే ఇన్స్పెక్టర్ రిషి రోల్ లో హీరో నవీన్ చంద్ర పోషించారు..మరి ఓటీటీలో మంచి హార్రర్, క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్..ఇలా అన్ని అంశాలు కలబోసిన మంచి వెబ్ సిరీస్ ను చూడాలనుకుంటున్నారా? అయితే ఇన్ స్పెక్టర్ రిషిపై ఓ లుక్కేయండి.
08. KUDI YEDAMAITHE
టైంలూప్ కాన్సెప్ట్ లో వచ్చిన ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ఇది..ఒక ఫుడ్ డెలివరీ గై, అర్ధరాత్రి ఒక యువతి రక్తపు శవాన్ని కనుగొన్న వ్యక్తి, తప్పిపోయిన పిల్లల కేసును పరిశోధిస్తున్న మహిళా పోలీసు ఇన్స్పెక్టర్ ఒకరినొకరు ఢీకొనడంతో వారు ఒక ఘోరమైన ప్రమాదంలో కలుసుకుంటారు, .వారు ఒకరిని ఒకరు గుర్తించే వరకు ఆ టైమ్ లూప్ ముగుస్తుంది..ఇదే స్టోరీ ప్లాట్ అండ్ ట్విస్ట్!!
07. RECCE
కామ తురాణం న భయం న లజ్జ!! పురాణాల నుంచి చెబుతున్న మాట. ఇప్పుడీ మాట ఎందుకు ప్రస్తావనకు వచ్చిందనేది ‘రెక్కీ’ చూశాక మీకే తెలుస్తుంది. సిరీస్ ఎలా ఉందనే విషయానికి వస్తే… పర్ఫెక్ట్ ఓటీటీ ప్రాజెక్ట్ ఇది. మొదట ఎపిసోడ్ నుంచి చివరి వరకూ సస్పెన్స్ మైంటైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. మూడు దశాబ్దాల క్రితం..1990లలో వాతావరణాన్ని స్క్రీన్ పైన బాగా ఆవిష్కరించారు
06. DAYA – SEASON 1
క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా వచ్చింది. బెంగాలీ సిలీస్ తక్దీర్ కథ ఆధారంగా ఈ సిరీస్‌ను తెలుగులో దయాగా రూపొందించారు దర్శకుడు పవన్ సాదినేని. ఈ మూవీలో ఈశా రెబ్బా, రమ్యా నంబీశన్, జోష్ రవి, విష్ణు ప్రియ కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగి, ప్రేక్షకులను అలరించింది. రెండో సీజన్ కోసం వేచిచూసేలా చేసింది..
05. OKA CHINNA FAMILY KATHA
వెబ్ సిరీస్ అంటే అడల్ట్ కంటెంట్, గ్లామర్ షో అనే ముద్ర పడింది. కొన్ని వెబ్ సిరీస్‌లు క్లీన్ కంటెంట్‌తో వస్తున్నాయి. అందులో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ కూడా ఉంటుంది. కంటెంట్ క్లీన్‌గా ఉంటే సరిపోతుందా? ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలి కదా! ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో అలా ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి..ఫ్యామిలీ ఆడియన్స్ డోంట్ మిస్ థిస్ సిరీస్!!
04. ATM – SEASON 1
బిగ్‌బాస్ ఫేమ్ వీజే సన్నీ, కృష్ణ బూర్గుల, రవిరాజ్ కీలకపాత్రలు పోషించిన ఏటీఎం సీజన్-1 వెబ్ సిరీస్ ఈ ఏడాది దుమ్మురేపింది. అంచనాలు లేకుండా జూన్‌లో జీ5లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్‌కు బాగానే రెస్పాన్స్ వచ్చింది. దోపిడీ చూట్టూ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఈ సిరీస్‌ను దర్శకుడు సీ చంద్రమోహన్ రూపొందించారు
03. RANA NAIDU
తెలుగు హీరోలు ఇద్దరు కలిసి నటించిన వెబ్ సిరీస్ కావటంతో రానా నాయుడుకి మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక వెంకటేశ్ ను ఇష్టపడే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ వెబ్ సిరీస్ చూడటానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఈ వెబ్ సిరీస్ లో వెంకటేశ్ తనకున్న ఫ్యామిలీ ఇమేజ్ కు భిన్నంగా ప్లే బాయ్ రోల్ లో కనిపించాడు. ఇక సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో వెంకీ మేనరిజమ్స్ ఆకట్టుకున్నా…బూతులు మాట్లాడటం టాలీవుడ్ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోయారు
02. LOSER
ఓవరాల్‌గా చూస్తే, ఇప్పటివరకు తెలుగులో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్‌లలో లూజర్ ఒకటి అనే విషయాన్ని కాదనలేం. ఒక బలమైన ఎమోషన్, విజయం, ప్రయోజనం మరియు ఇటీవలి కాలంలో మనం చుసిన కొన్ని బెస్ట్ పెర్ఫార్మన్స్ కలిగి ఉంది. మొత్తం పది ఎపిసోడ్లను అభిలాష్ రెడ్డి అద్భుతంగా తీశారు, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ మరియు చాలా ఆకర్షణీయంగా ఉండేలా చూసారు. డోంట్ మిస్ ఇట్
01. DHOOTHA
తెలుగులో రూపొందిన ఈ వెబ్ సిరీస్ హిందీ సహా అనేక భాషల్లోనూ మంచి ఆదరణ దక్కించుకుంది. డిసెంబర్ 1న ధూత సీజన్-1 సిరీస్ రాగా.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెండు వారాలకు పైగా నేషనల్ వైడ్‌గా టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. వివిధ దేశాల్లోనూ ధూత వెబ్ సిరీస్ ట్రెండ్ అయింది. టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్..ధూత వెబ్ సిరీస్‌ను సూపర్ నేచులర్ హర్రర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందించారు..