in

Mrunal Thakur To Debut In Tamil Cinema With Kanchana 4?

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందబోయే పీరియాడిక్ ప్యాన్ ఇండియా మూవీకి తన పేరే పరిశీలనలో ఉందనే టాక్ వచ్చింది కానీ ఇంకా ప్రాజెక్టే అఫీషియల్ గా లాంచ్ కాలేదు. దీని సంగతలా ఉంచితే ఓ దెయ్యం సినిమాలో నటించమని కోలీవుడ్ ఆఫర్ మృణాల్ కు వచ్చిందని చెన్నై టాక్.

లారెన్స్ హీరోగా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళబోతున్న సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కాంచన 4లో తన సరసన జోడిగా చేయమని లారెన్స్ అడిగాడని తెలిసింది. మాములుగా ఈ ముని, కాంచన సిరీస్ లో కథానాయికలకు అంతగా ప్రాధాన్యం ఉండదు. భయంతో అరవడానికి, హీరో పక్కన డాన్సులు చేయడానికే ఎక్కువ వాడుకుంటారు. గతంలో వేదిక, తాప్సీ లాంటి వాళ్లకు ఇది అనుభవమే. మరి మృణాల్ ఠాకూర్ ఎస్ చెబుతుందో లేదో వేచి చూడాలి. స్టోరీ నెరేషన్ మటుకు అయ్యిందట..!!

Alia Bhatt, Jr NTR to join Hrithik Roshan’s ‘War 2’!

kriti shetty planning to leave telugu movies?