దేవుళ్ళు ఎలా ఉంటారు? ఎవరైనా చూసారా? లేదు!! కానీ, మన సినిమా వాళ్ళు దేవుళ్ళు ఇలా ఉంటారు బాస్ అని, వారికీ ఒక డ్రస్ కోడ్, వెపన్ కోడ్ మరియు వారి ఫిసికల్ అప్పీరెన్స్ డిసైడ్ చేసేసారు. దానినే మనం చాల కాలంగా అంగీకరించాము, అదే నిజమని నమ్ముతున్నాము ఎంతగా అంటే, మొన్న ఆ మధ్య వచ్చిన ఆదిపురుష్ సినిమా లో రాముడికి మీసం పెడితే ఇదేం పైత్యం, ఇదేం పోయే కాలం అంటూ డైరెక్టర్ ని శపించేంతగ. రాముడు, కృష్ణుడు అనగానే మీసం లేకుండా క్లీన్ షేవ్ ( చివరికి వన వాసం సమయంలో కూడా). అలాగే భీముడు అనగానే దుబ్బ మీసం,అర్జునుడు, దుర్యోధనుడు అనగానే కోర మీసం, భీష్ముడు, శకుని, బలరాముడు అనగానే గుబురు గడ్డం ఇలా ఫిక్స్ అయిపోయాము. సినిమా సామాన్యుడి మీద ఎంత ప్రభావం చూపుతుంది అనడానికి ఇదొక క్లాసికల్ ఉదాహరణ. అదేమీ క్రైమ్ కాదు, దాని వలన ఎవరికి పెద్ద నష్టం లేదు, అసలు సినిమా అంటేనే” మేక్ బిలీవ్ “ప్రక్రియ.
ఇప్పుడు ఈ సుత్తి అంత ఎందుకు బాబు అంటారా, అక్కడికే వస్తున్న, అల్ టైం క్లాసిక్ మూవీ ”మాయ బజార్” నిర్మాణ సమయం లో ఒక తమాషా జరిగింది. తెలుగు,తమిళ్ వెర్షన్స్ ఒకే సారి నిర్మాణం జరిగింది., అందులో తెలుగు బలరాముడు అంటే మన గుమ్మడి గారు గడ్డం తో కనిపిస్తారు. తమిళ్ బలరాముడు అయిన బి.బాలసుబ్రహ్మణ్యం కి గడ్డం ఉండదు. ఎందుకంటె ఆయనకు గం ఎలర్జీ ఉందట, ఆ విషయం షూటింగ్ ప్రారంభించిన మొదటి రోజు తెలిసింది నిర్మాతలకు, ఏం చేద్దాం చెప్మి? అంటూ ధర్మ సందేహం లో పడిపోయారట నిర్మాతలు. చివరకు తమిళ బలరాముడు గడ్డం లేకుండానే నటించేసారు, ప్రేక్షకులు కూడా పెద్దగా పట్టించుకోలేదు, జనం లైట్ గ తీసుకుంటే ప్రమాదం లేదు, సీరియస్ గ తీసుకుంటేనే ఆదిపురుష్ వంటి అనుభవాలు కలుగుతాయి. అప్పట్లో అదేదో పౌరాణిక సినిమాలో రమణ రెడ్డి లాల్చీ వేసుకొని నారదుడి గ నటించేసారు..సినిమా వాళ్ళతో మజాకా కాదు డ్యూడ్!!, దే విల్ మేక్ యు బిలీవ్…!!