ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది బలగం మూవీ. స్టార్ హీరో కాస్టింగ్ భారీ బడ్జెట్ ఏవీ అవసరం లేకుండా సినిమాకు కథ మాత్రమే ప్రాణం అంటూ నిరూపించిన బలగం మూవీ హిట్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారి తీసింది కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనుకోని విజయాన్ని సాధించింది..
ఇదిలా ఉంటే వేణు తన తర్వాతి ప్రాజెక్టు గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదేంటంటే… వేణు తన తర్వాతి ప్రాజెక్టును స్టార్ హీరోతో ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే బాలయ్య కోసం వేణు కథ కూడా రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణతో సినిమా అంటే ఊర మాస్ కథ ఉండాల్సిందే. అయితే ఇప్పటికే తన కథను బాలయ్యకు వినిపించారట వేణు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో త్వరలోనే తెలియనుంది.