దర్శకుల ట్రాక్ రికార్డు, రేంజ్ చూడకుండా సినిమాలు చేసే రవితేజ.. తన కొత్త సినిమా విషయంలోనూ అలాగే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘కలర్ ఫొటో’ లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ రాజ్‌తో రవితేజ జట్టు కట్టనున్నాడట. ‘కలర్ ఫొటో’ తర్వాత సందీప్ ఏ ఫీచర్ ఫిలిం తీయలేదు. ‘హెడ్స్ అండ్ టేల్స్’ అనే వెబ్ సిరీస్‌కు క్రియేటర్‌గా వ్యవహరించాడు. అలాగే ‘ముఖచిత్రం’ అనే సినిమాకు స్క్రిప్టు అందించాడు. ఇవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఐతే ఈసారి అతను మాస్ రాజానే మెప్పించే కథ రెడీ చేశాడు. ఈ కథ వైవిధ్యంగా ఉంటూనే రవితేజ మార్కును వినోదానికి ఇందులో ఆస్కారం ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో రవితేజ మిడిలేజ్డ్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నాడట. మాస్ రాజా లెక్చరర్ అనగానే ‘మిరపకాయ్’ గుర్తుకు వస్తుందనడంలో సందేహం లేదు. అలాగే ఇది కూడా ఎంటర్టైనింగ్గా ఉంటుందని ఆశించవచ్చు. ఈ చిత్రంలో యువ కథానాయకులు చేయగల ప్రత్యేక పాత్రలు కూడా ఉన్నాయట. ఆ పాత్రలకు సిద్ధు జొన్నలగడ్డ, నిఖిల్, శర్వానంద్ లాంటి వాళ్లను కన్సిడర్ చేస్తున్నట్లు సమాచారం..