చాలా కాలం క్రితం జరిగిన ఒక సంఘటన! సంఘటన పాతదే అయినా, విషయం మాత్రం నిత్య యవ్వనం. చుట్టూ కేరింతలు కొట్టే అభిమానులు, అవసరం కోసం ఆకాశానికి ఎత్హే వందిమాగధులు, అడుగు తీసి అడుగు వేసే లోపు అమరే సౌకర్యాలు సినీ తారలకు తాము” డెమి గాడ్స్” అనే భావం కలిగిస్తాయి. కానీ, వాస్తవాన్ని కొంత మందే తెలుసుకుంటారు. ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ గారు షూటింగ్ పూర్తిచేసుకొని ఎయిర్ పోర్ట్ కు చేరుకోగానే తాను ఎక్కవలసిన, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, తప్పని పరిస్థితిలో వేరే ఫ్లైట్ లో ఎకానమీ క్లాస్ లో ప్రయాణం చేయవలసి వచ్చింది. అయిష్టంగానే ఫ్లైట్ ఎక్కిన దిలీప్ కుమార్ ని చూడగానే ఆటోగ్రాఫ్‌ల కోసం, షేక్ హాండ్స్ కోసం ఎగ బడ్డారు ప్రయాణికులు,గందరగోళం సద్దు మణిగాక తన సీట్ లో కూర్చున్నారు, తన ప్రక్క సీట్ లోని వ్యక్తి ఇదేమి పట్టించుకోకుండా చాల కూల్ గ పేపర్ చదువుకుంటున్నాడు. దిలీప్ కుమార్ కి కొంచెం ఆశ్చర్యం కలిగింది..
తాను కూర్చున్న తరువాత చాలా సేపటి వరకు అతను దిలీప్ కుమార్ ని పట్టించుకోకపోయేసరికి, కొంచెం అసహనం కలిగింది. చివరికి దిలీప్ కుమార్ గారే ఆయనను హలో అంటూ పరిచయం చేసుకున్నారు, అతను తిరిగి హలో అని ఓ చిరునవ్వు నవ్వి మళ్ళీ ఏదో బుక్ చదువుకుంటున్నాడు. దిలీప్ కుమార్ మీరు సినిమాలు చూడరా? అని అతనికి అడిగారు, చూస్తాను కానీ చాల అరుదుగా అన్నాడట, మీ వాలకం చూసి అనుకున్నాను, నా పేరు దిలీప్ కుమార్ అని పరిచయం చేసుకున్నాడట, అతను వెంటనే నా పేరు రతన్ టాటా, బిజినెస్ మాన్ అని కరచాలనం చేసాడట. అంతే దిలీప్ కుమార్ కి దిమ్మ తిరిగిపోయింది, గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రతన్ టాటా! ఇలా ఎకానమీ క్లాస్ లో అని అడగగానే, ఇలా ఉండటమే నాకు ఇష్టం, నాకు అవకాశం దొరికినప్పుడల్లా నేను ఇలాగె ప్రయాణిస్తుంటాను అని సమాధానం ఇచ్చిన రతన్ టాటా సింపల్సిటీకి ఫిదా అయిన దిలీప్ కుమార్ , రతన్ టాటా గారి ఆటోగ్రాఫ్ అడిగి తీసుకున్నారట. అది రియల్ హీరోకి రీల్ హీరోకి ఉన్న తేడా..!!