ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు డబ్బింగ్ సినిమాలతో తన కెరీర్ ప్రారంభించి, ఆ తరువాత “గీతా ఆర్ట్స్” సంస్థ స్థాపించి స్ట్రెయిట్ చిత్రాలు నిర్మిస్తూ అంచెలంచెలుగా ఎదిగి, ఈ రోజు సినిమా ఇండస్ట్రీ ని శాసించే స్థాయికి ఎదిగారు.ఈ మధ్యనే అల్లు స్టూడియోస్ కూడా స్థాపించారు, తండ్రి అల్లు రామలింగయ్య గారి లెగసీ కొనసాగింపుగా అయన పేరుతో స్టూడియో స్థాపించారు. మరి గీతా ఆర్ట్స్ పేరు వెనుక ఎవరు ఉన్నారు? ఆ పేరు సూచించటంలో అల్లు రామలింగయ్య గారి ప్రమేయం ఉన్నది, కానీ అరవింద్ గారు ఆ పేరునే ఖరారు చేయటం వెనుక ఇంకొకరు ఉన్నారు. అల్లు రామలింగయ్య గారు నటుడిగా కమెడియన్ అయినా, వ్యక్తిగా అయన చాల యదార్ధ వాదీ..
చాలా గంభీరమయిన ఆలోచన విధానం కలిగిన తాత్వికుడు, దానికి అనుగుణంగానే, గీతా సారాంశం ని గుర్తు చేసే విధంగా,” ప్రయత్నం మాత్రమే మనది, ఫలితం మన చేతిలో ఉండదు” సినిమా నిర్మాణ శైలికి కూడా సరిగా సరిపోయే పేరును సూచించటం, అరవింద్ గారు ఆ పేరును తమ నిర్మాణ సంస్థకు పెట్టడం జరిగిపోయాయి. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది, అరవింద్ గారు గీతా అనే పేరు పెట్టడం వెనుక, “గుర్తుకొస్తున్నాయి” టైపు నవ యవ్వన గత అనుభవం కూడా ఉంది. మన అరవింద్ గారి కాలేజీ డేస్ గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా గీత అట. అందుకే పుణ్యం, పురుషార్థం రెండు కలసి వచ్చే పేరు కాబట్టి గీతా ఆర్ట్స్ పేరును ఖరారు చేసేసారు. మొత్తానికి అయన అదృష్ట జాతకుడు అందుకే ఆయనకు అన్ని ఆలా కలసి వచ్చేస్తుంటాయి..!!