in

‘Sita Ramam’ Combo back on Cards!

చాలా ఏళ్ల త‌ర్వాత అయినా స‌రే.. తెలుగులో వ‌చ్చిన ఉత్త‌మ ప్రేమ‌క‌థా చిత్రాల జాబితా తీస్తే అందులో సీతారామం మూవీకి క‌చ్చితంగా చోటు ఉంటుంది. హ‌ను రాఘ‌వ‌పూడి అంత గొప్ప‌గా తీశాడు ఈ చిత్రాన్ని. చాలా సినిమాలు కాల క్ర‌మంలో క్లాసిక్స్ అని, దృశ్య‌కావ్యం అని గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటాయి. కానీ సీతారామం మాత్రం తొలి రోజే క్లాసిక్ అయిపోయింది. దృశ్య‌కావ్యంగా పేరు తెచ్చుకుంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కొంచెం డ‌ల్ నోట్‌తో మొద‌లైన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత గొప్ప‌గా పుంజుకుని లాంగ్ ర‌న్‌తో క‌మ‌ర్షియ‌ల్‌గానూ పెద్ద విజ‌యాన్నే అందుకుందీ చిత్రం. ఈ సినిమా తీసిన హ‌ను రాఘ‌వపూడితో పాటు ప్ర‌ధాన పాత్ర‌ధారులు, టెక్నీషియ‌న్లు, నిర్మాత‌లు.. ఇలా అంద‌రికీ గొప్ప పేరు వ‌చ్చింది. మ‌రి ఈ కాంబినేష‌న్లో ఇంకో సినిమా వ‌స్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న పులకింప‌జేసేదే.

ఐతే ఈ ఆలోచ‌న త్వ‌ర‌లోనే కార్య‌రూపం దాల్చ‌బోతున్న‌ట్లు స‌మాచారం. హ‌ను ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ మ‌రో సినిమాను నిర్మించ‌బోతోంద‌ని.. ఇందులోనూ దుల్క‌ర్, మృణాల్‌లే జంట‌గా న‌టిస్తార‌ని తాజా స‌మాచారం. ఐతే ఇది సీతారామం చిత్రానికి సీక్వెల్ మాత్రం కాద‌ట‌. ఈ సినిమాకు సీక్వెల్ ఉండ‌ద‌ని, మ‌ళ్లీ సీతారామం జంట‌తో సినిమా మాత్రం ఉంటుంద‌ని హ‌ను ఇంత‌కుముందే హింట్ ఇచ్చాడు. ఇప్పుడు సీరియ‌స్‌గానే ఆ ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే దీని గురించి ప్ర‌క‌ట‌న కూడా రాబోతోంద‌ట‌. ఐతే సీతారామంతో ప్రేక్ష‌కుల‌ను అంత‌గా మైమ‌రిచిపోయేలా చేసిన కాంబినేష‌న్లో ఇంకో సినిమా అంటే అంచ‌నాలు భారీగా పెరిగిపోతాయి..!!

Gautham Menon confirms Gharshana 2 with Venkatesh!

actress Samantha going for skin Treatment In USA?