అంటే సుందరానికి” టీజర్ లాంచ్‌లో నాని మాట్లాడుతూ ఈ చిత్రాన్ని కన్నడ ప్రేక్షకులు తెలుగులోనే చూస్తారని, అందుకే కన్నడలో డబ్ చేయడం లేదని, చాలా మంది కన్నడ ప్రజలు తెలుగును అర్థం చేసుకుంటారని, తెలుగు చిత్రాలను చూడటానికి ఇష్టపడతారని అన్నారు. కానీ మిగతా వాళ్లకు మాత్రం వాళ్ళ భాషలో సినిమాను విడుదల చేస్తేనే అర్థమౌవుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై కన్నడ ప్రేక్షకులు ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా నానిని ట్యాగ్ చేస్తూ తెలుగు హీరోలు తమ సినిమాలను కన్నడ ప్రేక్షకులు చూడాలనుకుంటే, కన్నడలోకి కూడా డబ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలతో షాక్‌కు గురైన నాని స్పందిస్తూ “డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేనప్పుడు కూడా నా సినిమాలు లేదా ఇతర తెలుగు చిత్రాలను మన కన్నడ కుటుంబం ఎలా ఆదరాభిమానాలు చూపించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రెస్ మీట్‌లో ఒక నిర్దిష్ట సందర్భంలో సమాధానం వస్తుంది. సోషల్ మీడియాలో ఆ సందర్భాన్ని బయటకు తీశారు. నేను చెప్పాలనుకున్న విషయాన్ని సరిగ్గా చెప్ప్పలేకపోయినందుకు సారీ… బౌండరీస్ దాటి కన్నడ సినిమా సాధించిన సక్సెస్ కు గర్వపడుతున్నా” అంటూ వివరణ ఇవ్వక తప్పలేదు నానికి.