పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించిన మహానటి సావిత్రి, అప్పటికి,ఇప్పటికి, ఎప్పటికి ఆమెకు సరి తూగే నటి లేదు, రాలేదు , రాబోదు అని నమ్మే వారు చాలా మంది ఉన్నారు ఇప్పటికి. అంతటి మహానటి కి ప్రభుత్వ పురస్కారాలు ఎందుకు రాలేదు అనే సందేహం చాల మందిలో ఉంది, కాని నిజం ఏమిటంటే, సావిత్రి గారే తనకు ఇస్తామన్న పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించారు. 1968 – 1969 సంవత్సరంలో ఆమె పేరును పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలియ చేసింది భారత ప్రభుత్వం, అది వినిన వెంటనే సలహా కోసం సహా నటుడు కొంగర జగ్గయ్య గారిని కలసి విషయం చెప్పారట సావిత్రి గారు, అందుకు అంగీకరించమని చెప్పారట జగ్గయ్య గారు, కానీ సావిత్రి గారు వద్దు బావ, నేను ఇంకా ఆ అవార్డు తీసుకొనే స్థాయికి ఎదగ లేదు,నాకు ఏ అవార్డులు వద్దు, అని తిరస్కరించారట.
ఆలా ప్రభుత్వ అవార్డు ను తీసుకోవటానికి ప్రతిభ ఎంత అవసరమో, తిరస్కరించటానికి అంతే నిజాయితీ, ధైర్యం కావాలి. రెండు సినిమాలు హిట్ కాగానే తామెదు సాధించేశామని, రెమ్యూనరేషన్ లు పెంచేసి, తామేదో ఆకాశం నుంచి దిగి వచ్చినట్లు ప్రవర్తించే నేటి తరం, సావిత్రి గారి నుంచి నేర్చుకో వలసింది చాల ఉంది, ఏమి చేయాలో, ఏమి చేయ కూడదో కూడా సావిత్రి గారి జీవితం నుంచి తెలుసుకోవచ్చు నేటి తరం. ఆమె ప్రతిభ, మహోన్నతమయిన ప్రవర్తన, ఒక రంగుల చిత్రం అయితే, మరో కోణం నలుపు, తెలుపుల విషాద చిత్రం ఆమె సంసార జీవితం. గ్లిసరిన్ లేకుండా కంటి నుంచి ఎన్ని కన్నీటి చుక్కలు కావాలో లెక్క కట్టి నటించగలిగిన ఆమెకు తెలిసి ఉండదు తన జీవితం కన్నీటి మయం, విషాద భరితం అని.