లెజెండ్, పండగజేస్కో, జన్నత్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ చేస్తోన్న ఆదిపురుష్ చిత్రంలో నటించే అవకాశం కొట్టేసింది. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.. “అవును నేను ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నాను. ఇందుకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు పూర్తిగా ఇది విభిన్నమైన ప్రపంచం. సినిమా ప్రియులు ఈ భారీ చిత్రాన్ని చూసి కచ్చితంగా మెచ్చుకుంటారని అనుకుంటున్నాను.” అని సోనాల్ చౌహాన్ స్పష్టం చేసింది.