అల్లు వారి వారసుడిగా గంగోత్రి తెరంగేట్రం చేసిన ఈ కుర్రాడు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. క్లాస్ అయినా.. మాస్ అయినా.. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అయినా.. ఫ్యామిలీ అయినా.. యాక్షన్ అయినా.. మల్టీ స్టారర్ రోల్స్ అయినా..ఎక్సపరింమెంటల్ తో పాటు ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోవడంలో తనను తాను బాగానే మలచుకున్నాడు. అలాంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఈరోజు. ‘పుష్ప’ సినిమా గ్రాండ్ సక్సెస్ అయ్యింది..పాన్ ఇండియా స్టార్ అయ్యాడు .ఈ సందర్బంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..
అల్లు అర్జున్ 1982లో ఏప్రిల్ 8వ తేదీన తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నిర్మలకు జన్మించాడు. అల్లుఅర్జున్ చిన్ననాటి నుండి సుమారు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు అక్కడే పెరిగాడు. అల్లు అర్జున్ కు చిన్ననాటి నుండే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తన చిన్నప్పుడే వారి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిగితే రామ్ చరణ్, అల్లు అర్జున్ పోటీ పడి మరీ డ్యాన్సులు చేసేవారట. తనలోని ప్రతిభను గుర్తించిన మెగాస్టార్ చిరంజీవి డాడీ సినిమాలో ఓ పాత్రలో నటించేందుకు అవకాశమిచ్చాడు.
అల్లు అర్జున్ డాడీ సినిమాలో కంటే ముందుగానే ‘విజేత‘ సినిమాలో ఓ బాల్య నటుడి పాత్రలో నటించాడు..అల్లు అర్జున్ 2011లో హైదరాబాద్ సిటీలో మార్చి 6వ తేదీన స్నేహాలతా రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. వీరికి అయాన్, అర్హా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు..అల్లు అర్జున్ నటించిన చాలా చిత్రాలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఈ స్టైలిష్ స్టార్ ‘పరుగు‘, ‘వేదం‘, ‘రేసు గుర్రం‘ సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నాడు. అంతేకాదు ‘రుద్రమదేవి‘ చిత్రానికి ఉత్తమ సహయనటుడిగా కూడా అవార్డులను అందుకున్నాడు..!!