in

Veteran singer-composer Bappi Lahiri passes away at 69!

సినీరంగంలో మరో తార నేలరాలింది. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి (69) మృతి. ముంబైలోని క్రిటికేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. లహిరి నెల రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి ఈ మధ్యే డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆయన ఆరోగ్యం మంగళవారం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబసభ్యులు డాక్టర్ ను ఇంటికి పిలిపించారు. డాక్టర్ సూచన మేరకు లహిరిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. పరిస్థితి విషమించడంతో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో  చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. బప్పి లహిరి గత ఏడాది ఏప్రిల్ లో కరోనా బారినపడ్డారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు..బాలీవుడ్ సహా టాలీవుడ్ సినిమాలకు కూడా ఆయన సంగీతమందించారు.

1970 –80 లల్లో బప్పీ లహరి పాడిన, కంపోజ్ చేసిన ఎన్నో పాపులర్ సాంగ్స్ విడుదలయ్యాయి. సింహాసనం, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్ స్పెక్టర్స వంటి తెలుగు చిత్రాలకు సంగీతం అందిచారు. తెలుగు, తమిళ, కన్నడ, గుజరాత్ సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. తెలుగులో సింహాసనం, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్ స్పెక్టర్, స్టేట్ రౌడీ, రౌడీగారి పెళ్లాం, దొంగాపోలీసు, బ్రహ్మ, నిప్పురవ్వ, బిగ్ బాస్, ఖైదీ ఇన్ స్పెక్టర్ చిత్రాలకు సంగీతం అందించారు.  ఇటీవలే విడుదలైన డిస్కో రాజా చిత్రంలో పాట పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా…గాయకుడిగానూ ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు.

noted telugu Heroine’s Mother Turns Producer!

Nikitha Thukral at ‘Apartment’ telugu Movie Launch!