అదేంటో గానీ, కీర్తిసురేష్ కి ఏమాత్రం అదృష్టం కలసి రావడం లేదు. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి.కమర్షియల్ సినిమాల్లో కూడా తనకు అవకాశాలురావడం లేదు. తన చేతిలో ఉన్న పెద్దసినిమా.. `సర్కారువారి పాట` మాత్రమే. నిన్నా మొన్నటి వరకూ `గుడ్‌లక్ సఖి`పై ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్టయితే.. తన ఖాతాలో కొన్ని లేడీ ఓరియెంటెడ్ పాత్రలు పడతాయని నమ్మింది. కానీ.. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్మూటగట్టుకుంది.
కీర్తి సురేష్ ఈ సినిమాని ఎలా ఒప్పుకుంది? ఏం చూసి ఒప్పుకుంది? అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈమధ్య కాలంలో ఇంత పేలవమైన స్క్రీన్ ప్లేతో సినిమా రాలేదన్నది విశ్లేషకుల మాట. ఏదైతేనేం… మొత్తానికి కీర్తి ఖాతాలో మరో డిజాస్టర్ చేరిపోయింది. మిస్ ఇండియా, పెంగ్విన్, అన్నాత్తై, మరక్కర్.. ఇలా కీర్తి నుంచి వరుసగా ఫ్లాపులే వస్తున్నాయి. ఈ ఫ్లాపుతో.. తన కెరీర్ మరింత సంక్లిష్టంలో పడినట్టైంది. గ్లామర్ పరంగానూ కీర్తికి మైనస్ మార్కులే పడుతున్నాయి.
మరీ బక్కచిక్కిపోయి కళావిహీనంగా తయారైపోయింది. కీర్తి కెరీర్ ప్రారంభంలో `ఐరెన్ లెగ్` అనే అపప్రద మూటగట్టుకుంది. తను నటించిన కొన్ని సినిమాలు అప్పట్లో ఆగిపోయాయి. విడుదలైనా ఫలితాలు ఉండేవి కావు. ఆ తరవాత… వరుస విజయాలతో ఐరెన్ లెగ్ అనే ముద్ర చెరిపేసింది. ఇప్పుడు మళ్లీ తన కథ మొదటికి వచ్చింది. ఇప్పుడంతా… కీర్తిని ఐరెన్ గానే చూస్తున్నారు. మరో రెండు మూడు హిట్లు పడితే గానీ, ఈ ముద్ర చెరిగిపోదు.