10. SATHYA IN ‘VIVAHA BOJANAMBU’
సత్య ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. చిన్న చిన్న కామెడీ పాత్రల్లోనే అదరగొట్టేసే అతను.. హీరోగా ఫుల్ లెంగ్త్ హీరో రోలో ఆకట్టుకున్నాడు. పదే పదే తన మావయ్యకు దొరికిపోయే సన్నివేశాల్లో కవర్ చేస్తూ అతను ఇచ్చే హావభావాలు భలేగా అనిపిస్తాయి. నూటికి నూరు శాతం తన పాత్రకు అతను న్యాయం చేశాడు. తన కోసం ఓసారి సినిమా చూడొచ్చు అనిపించాడు సత్య. కామెడీ సీన్లలోనే కాక.. చివర్లో రెండు మూడు ఎమోషనల్ సీన్లలోనూ సత్య మెప్పించాడు.
09. PRADEEP IN ’30 ROJULLO PREMINCHADAM ELA’
యాంకర్‌గా ఎన్నో ఏళ్ళ నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ప్రదీప్ మాచిరాజు.. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అంటూ హీరో అయ్యాడు. ఈ చిత్రం కూడా మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇందులోని ‘నీలి నీలి ఆకాశం’ పాట సంచలనం రేపిన విషయం తెలిసిందే..మొదటి సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న ఈ యువ హీరో త్వరలోనే మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నట్లు ప్రకటించాడు..అల్ ది బెస్ట్ ప్రదీప్..
08. MEENAKSHI CHOWDARY IN ‘ICHATA VAHANALU NILUPARADU’
2018 హర్యానా లో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా 2018 పేజియాంట్’ పోటీల్లో విజేతగా నిలిచింది మీనాక్షి చౌదరి.. అక్కినేని సుశాంత్ హీరోగా తెరకెక్కిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో హీరోయిన్‌గా మారింది మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. తొలి సినిమా విడుదలకు ముందే రవితేజ సరసన ‘ఖిలాడి’లో అవకాశం దక్కించుకుంది. అలాగే హిట్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న హిట్ 2లో ఛాన్స్ కొట్టేసింది.
07. SREELEELA IN ‘PELLI SANDHADI’
రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘పెళ్లి సందD’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కన్న భామ శ్రీలీల. ఈ సినిమాలో శ్రీలీల తన అందంతో అందరిని కట్టిపడేసింది. పెళ్లి సందడి సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్నాయి.. రవితేజ సరసన ఓ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.
06. ROSHAN MEKA IN ‘PELLI SANDHADI’
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా సక్సెస్ ఫుల్ లాంఛ్ అయ్యాడు. ఈయన నటించిన పెళ్లి సందD మంచి విజయం అందుకుంది. నెగిటివ్ టాక్‌తో ఓపెన్ అయిన కూడా మంచి వసూళ్లు సాధించింది ఈ చిత్రం..రోషన్ యాక్టింగ్, డాన్స్, కామెడీ టైమింగ్ కు ఆడియన్స్ మంచి మార్కులు వేశారనే చెప్పాలి..తన తండ్రి లాగే ఇతను కూడా ఇండస్ట్రీ లో మంచి పేరు సాధించాలని కోరుకుందాం..
05. KETIKA SHARMA IN ‘ROMANTIC’
డాష్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరితో నటించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది ఉత్తరాది ముద్దుగుమ్మ కేతిక శర్మ. తొలి సినిమాతోనే తనదైన అందాలతో కుర్రకారు చూపులను తనవైపు తిప్పుకుంది. ఈ మూవీ షూటింగ్‌లో ఉండగానే.. నాగశౌర్య‘లక్ష్య’మూవీలో చాన్స్ దక్కించుకుంది. తొలి మూవీలో ఏమాత్రం మొహమాటం పడకుండా అందాలతో కనువిందు చేసిన కేతికా.. ‘లక్ష్య’లో తనదైన నటనతో ఆకట్టుకుంది.
04. FARIA ABDULLAH IN ‘JATHI RATNALU’
నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘జాతిరత్నాలు’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతోపాటు తెలుగు ప్రేక్షకుల మది దోచుకుంది. ‘చిట్టి’ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టికి ఎంత క్రేజ్ వచ్చిందో..ఫరియాకు అంతే వచ్చింది.‘జాతిరత్నాలు’తర్వాత ఈ పొడగరి బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇటీవల విడుదలైన అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో కనిపించి సందడి చేసింది.
03. TEJA SAJJA IN ‘ZOMBIE REDDY’
14 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాడు తేజ సజ్జ. బాల నటుడు నుంచి హీరోగా మారాడు. రెండేళ్ల కింద సమంత ‘ఓ బేబీ’ లో సైడ్ క్యారక్టర్ చేసిన తేజ..ఈ ఏడాది ‘జాంబి రెడ్డి’ తో మెయిన్ హీరో అయ్యాడు. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘అద్భుతం’ సినిమాలు వెంట వెంటనే రిలీస్ చేసాడు. ప్రస్తుతం ‘హనుమాన్’ అనే సోసియో ఫాంటసీ లో మెయిన్ లీడ్ గ నటిస్తున్నాడు. సెలెక్టివ్ గా స్టోరీ, పాత్రలు చేసుకుంటున్న తేజ మునుముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.
02. VAISHNAV TEJ IN ‘UPPENA’
మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో ఈయన. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, మెగాస్టార్ మేనల్లుడుగా వచ్చిన వైష్ణవ్ తేజ్.. తొలి సినిమా ఉప్పెనతో సంచలనం రేపాడు. బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ చిత్రం 51 కోట్ల షేర్ వసూలు చేసింది..లాక్ డౌన్ తరువాత మొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయ్యాక జనాలని మళ్ళి థియేటర్స్ కు రప్పించేలా చేసిన సినిమాల్లో ఇదొక్కటి.
01. KRITI SHETTY IN ‘UPPENA’
తెలుగు వెండితెరపై ‘ఉప్పెన’లా దూసుకొచ్చిన హీరోయిన్ కృతిశెట్టి. ఉప్పెన చిత్రంలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ.. పక్కింటి అమ్మాయిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులనే కాకుండా దర్శక నిర్మాతలను కూడా క్యూ కట్టేలా చేసింది. ఒకే ఒక సినిమాతో కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.