కొంతమంది హీరోయిన్స్ కోసం అప్పుడు ఇప్పుడు దర్శకులు పట్టుపట్టి వారు మాత్రమే ఈ హీరోయిన్ రోల్ చేయగలరని గట్టి నమ్మకంతో వెళ్ళి కథ చెబుతుంటారు. అవసరమైతే వారు కావాలనుకున్న హీరోయిన్ కోసం నెలలకు నెలలు వెయిట్ చేసి మరీ తమ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకుంటారు. అందుకు ఉదాహరణ నిత్యా మీనన్, సాయి పల్లవి లాంటివారే. ఫిదా సినిమా సమయంలో కథ చెప్పిన తర్వాత సాయి పల్లవి ..నాకు కథ నచ్చింది.
చేయడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ 6 నెలల వరకు అయితే షూటింగ్‌కు రాలేనని దర్శకుడు శేఖర్ కమ్ములకు నిర్మొహమాటంగా చెప్పింది. అయినా సరే ఫిదా సినిమాలో భానుమతి పాత్రకు సాయి పల్లవి తప్ప మరో హీరోయిన్‌ను శేఖర్ కమ్ముల ఊహించుకోలేకపోయాడు. అందుకే సాయి పల్లవి అడినట్టుగానే 6 నెలలు సమయం ఇచ్చి ఆ తర్వాతే సినిమా మొదలు పెట్టాడు.. ఇప్పటి వరకు నిత్యా మీనన్ చేసిన సినిమాలన్నీ కూడా..
దర్శకులు వారు రాసుకున్న పాత్రకు ఆమె మాత్రమే కావాలని తనని ఎంచుకొని సినిమాలు చేశారు తప్ప ఆమె ఎప్పుడూ ఓ దర్శకుడి వద్దకు వెళ్ళి నాకు ఈ రోల్ ఇవ్వండి అని అడిగింది లేదట. వాళ్ళంతట వారే వచ్చి నాకు అవకాశం ఇచ్చారు గాన్నీ నేనెవరి దగ్గరకు వెళ్ళి అవకాశం ఇవ్వమని అడగలేదని నిత్యా మీనన్ తెలిపింది. టాలీవుడ్‌లో నిత్యా మీనన్ చేసింది చాలా తక్కువ సినిమాలు. కానీ ఆ సినిమాలన్నీ ఆమెకు చాలా మంచి పేరు తీసుకువచ్చాయి..