in

i used to live on my wife’s earnings : rajamouli

రోజున ఇంత సక్సెస్ ఫుల్ గా పేరు తెచ్చుకున్న జక్కన్న.. కొంతకాలం క్రితం భార్య సంపాదన మీద బతికేవాడన్న విషయాన్ని ఆయనే చెప్పుకున్నారు. పెద్దగా చదువుకోని రాజమౌళి.. ఈ రోజున ఎన్నో విద్యా సంస్థలకు ముఖ్య అతిధిగా హాజరవుతూ విద్యార్థులకు తాను చెప్పాలనుకున్న మాటను చెబుతుంటారు. తనకు చిన్నతనం నుంచి సినిమా ఇండస్ట్రీ తప్పించి మరింకేమీ తెలీదని.. తన ప్రపంచమంతా సినిమానే అని చెప్పారు.

చిన్నతనంలో చదువు సరిగా అబ్బలేదని.. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండటంతో అన్ని క్రాఫ్ట్సులో పని చేసినట్లు చెప్పారు. ఒక దర్శకుడికి అన్ని క్రాఫ్టుల్లో పట్టు ఉండాలన్న కసితో తాను అన్నీ నేర్చుకున్నట్లు చెప్పారు. ఒక టైంలో తనకు పైసా సంపాదన లేదని.. అలాంటి వేళ తన భార్య రమా రాజమౌళి జీతం మీదనే తాను బతికినట్లు చెప్పారు. అప్పట్లో తనను ఆమే పోషించినట్లు చెప్పారు.

అలా చెప్పుకోవటానికి తనకు సిగ్గేయటం లేదన్న రాజమౌళి.. సంతోషంగా ఉందన్నారు. తాను దర్శకుడు కాక ముందు ఉన్న పనల్లా.. పొద్దున్నే భార్యను ఆఫీసులో డ్రాప్ చేయటం.. తిరిగి వచ్చి కథలు.. డైలాగ్స్ రాసుకోవటం.. సాయంత్రం ఐదింటికి ఆఫీసుకు వెళ్లి తీసుకొచ్చేవాడినని తన పాత విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. విజేతగా నిలిచే ప్రతి ఒక్కరి వెనుక ఎవరో ఒకరు ఉంటారన్నది ఎంత నిజమో రాజమౌళి మాటల్ని వింటే ఇట్టే అర్థమవుతుంది.

Pelli SandaD girl signs 2 more movies in tollywood!

nikki galrani latest stills in red dress!