జంబలకిడి పంబ” సినిమా కథ ఎలా పుట్టింది? ఈ.వి.వి. గారు జంధ్యాల దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గ పని చేస్తున్న రోజుల్లో, వంశీ గారి నవలలు చదివి స్ఫూర్తి పొంది ఒక కథ రాసి ఆంధ్ర జ్యోతి వార పత్రికకు పంపించారు, ఆ కథ మగవాళ్ళు ఆడవారిగా, ఆడవాళ్లు మగవాళ్ళుగా మారితే దాని పరిణామాలు ఎలావుంటాయి అనే పాయింట్ మీద రాసారు, దాని పేరే జంబలకిడి పంబ.ఆంధ్ర జ్యోతి వారు అది ప్రచురణకు పనికి రాదనీ తిప్పి పంపేశారు. ఆ తరువాత ఆ కథను ఒక పదిహేను, యిరవై సీన్ లుగా రాసి జంధ్యాల గారికి చూపించారట. అది చూసిన జంధ్యాల గారు కాన్సెప్ట్ బాగుంది కానీ సినిమా తీసేందుకు సరిపోదు, ఏదైనా సినిమాలో ఒక ట్రాక్ లాగా వాడుకుంటే బాగుంటుంది అని సలహా ఇవ్వటమే కాకా,
మొగుడు పెళ్ళాలు అనే సినిమా లో జంబలకిడి పంబ అనే పదాన్ని టైటిల్స్ లో వాడారట. కానీ ఆ తరువాత దాని గురించి ప్రస్తావన రాక పోవటం తో అది సినిమా రూపం దాల్చలేదు. ఈ.వి.వి. గారు డైరెక్టర్ అయిన తరువాత ఈ కథను మరి కొంత మెరుగు పరచి, నిర్మాతలకు ధైర్యం కోసం తాను కూడా భాగస్వామిగా మారి “జంబలకిడి పంబ” చిత్రం నిర్మించటం జరిగింది. ఈ.వి.వి.గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు ఆ చిత్రాన్ని ఎంతగా ఆదరించారో మనందరికీ తెలిసిన విషయమే.