సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా మాంచి పేరుంది దర్శకుడు పూరీ జగన్నాధ్‌కి. అతి తక్కువ టైంలో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు పూరీ. అయితే పూరీ లైఫ్‌ని మార్చిన సినిమా మాత్రం “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం” అనే చెప్పాలి. ముందుగా పవన్ అపాయింట్మెంట్ కోసం వినిపించిన కథ కూడా ఇదే.. కానీ పవన్ దగ్గరకి వెళ్ళాక చెప్పింది మాత్రం బద్రి సినిమా కథ. సీనియర్ దర్శకులు కే. బాలచందర్ తీసిన మరోచరిత్ర సినిమా పూరికి అల్ టైం ఫేవరేట్ మూవీ. చనిపోదామని కొండమీదికి వచ్చిన ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది అనే లైన్ తో పూరీ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథను రాసుకున్నాడు.
దర్శకుడు కాకముందే పూరీ ఈ స్టొరీని రాసుకున్నారు. ఈ కథకి కొండచరియ అనే టైటిల్ పెట్టి దూరదర్శన్‌లో సీరియల్ కోసం పంపిస్తే రిజెక్ట్ చేశారు. దీనితో ఈ కథని పక్కన పెట్టి బద్రి సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు పూరీ. ఆ సినిమా సక్సెస్ తర్వాత బాచి అనే సినిమా తీసి పెద్ద ప్లాప్ అందుకున్నాడు. ఈ సినిమా పోవడంతో మళ్ళీ కథలపైన కూర్చున్న పూరీకి కొండచరియ కథ గుర్తుకువచ్చింది. అదే కథలో కొన్ని మార్పులు చేసి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంగా సినిమాకి కథ రెడీ చేశాడు. ముందుగా హీరో సుమంత్‌కి కథ చెబితే రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత తరుణ్ కూడా నో అనేశాడు. దీనితో చివరికి ఆ కథ రవితేజ వద్దకి వెళ్ళింది.