in

mahesh babu and rajamouli to team up for Forest Adventure!

హేశ్ బాబు కథానాయకుడిగా రాజమౌళి ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పనుల్లో ఉన్న రాజమౌళి ఆ తరువాత ప్రాజెక్టును చేసేది మహేశ్ బాబుతోనే. ఆ దిశగా సన్నాహాలు మొదలైపోయాయి కూడా. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తికాగానే, మహేశ్ బాబు ప్రాజెక్టు పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉంటుందన్న మాట. ఈ లోగా ప్రస్తుతం చేస్తున్న పరశురామ్ సినిమా ‘సర్కారువారి పాట’తో పాటుగా, త్రివిక్రమ్ సినిమాను కూడా మహేశ్ బాబు పూర్తి చేస్తాడు. అయితే ప్రభాస్ .. చరణ్ .. ఎన్టీఆర్ ల కోసం రాజమౌళి కథలను సిద్ధం చేయడం వేరు..

మహేశ్ బాబుతో చేయడం వేరు. ఎందుకంటే పౌరాణికాలు .. చారిత్రకాలు తనవంటికి సరిపడవని చాలా సందర్భాల్లో మహేశ్ బాబు చెప్పాడు. అంటే ఆ తరహా సినిమాలు చేసే ఆలోచన ఆయనకి లేదని అర్థం. దాంతో మరి మాహేశ్ బాబు కోసం రాజమౌళి ఏ జోనర్ నుంచి ఏ తరహా కథను ఎంచుకోనున్నాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే మహేశ్ తో రాజమౌళి చేసే సినిమా, హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజ్ ‘ఇండియానా జోన్స్’ తరహాలో సాగనుందనే విషయం బయటికి వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ ఈ విషయాన్ని చెప్పడం విశేషం.

bhaskar reveals reason behind his ‘orange’ failure!

Bhavya Bishnoi happy for calling off engagement with mehreen!