మైలవరపు సూర్య నారాయణ అంటే చాలా మంది కి తెలియక పోవచ్చు, ఎం.ఎస్. నారాయణ అంటే బహుశా గుర్తుపట్టని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఎం.ఎస్. గారి వివాహం చేసింది పరుచూరి గోపాలకృష్ణ గారే. ఎం.ఎస్. నారాయణ, పరుచూరి గోపాలకృష్ణ గారిది గురు శిష్యుల బంధం, వారిద్దరిది సినీ పరిశ్రమ బంధం కాదు. పరుచూరి గోపాలకృష్ణ గారు 1971 నుంచి 1975 వరకు లాల్ బహదూర్ శాస్ట్రీ ఓరియంటల్ కాలేజీ , చిన నిండ్రకొలను, వెస్ట్ గోదావరి జిల్లా లో లెక్చరర్ గ పని చేస్తున్న రోజుల్లో, ఎం.ఎస్. వారి శిష్యుడు. ఎం.ఎస్. గారి సతీమణి కళాప్రపూర్ణ గారు కూడా గోపాలకృష్ణ గారి శిష్యురాలు.
సెలవుల్లో తమ సొంత ఊరు మేడూరులో ఉన్న గోపాలకృష్ణ గారి వద్దకు కళాప్రపూర్ణ తో కలసి వచ్చిన ఎం.ఎస్. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు అని చెప్పగానే, వారిద్దరి వివాహం చేసి, చల్లపల్లి లో ఒక సినిమా థియేటర్ లో బుకింగ్ క్లర్క్ గ ఉద్యోగం ఇప్పించి ఆదరించారు గోపాలకృష్ణ. సెలవుల తరువాత మూర్తి రాజు గారి తో ఎం.ఎస్. గారి ఆదర్శ వివాహం గురించి చెప్పి , వారి విద్య సంస్థలోనే ఎం.ఎస్. నారాయణ కు మాస్టర్ ఉద్యోగం ఇప్పించారు పరుచూరి గోపాలకృష్ణ గారు..