టి ఎల్.వి. ప్రసాద్ డైరెక్టర్ గ హిందీలో 70 సినిమాలు చేసారు, అందులో 30 సినిమాలు మిదున్ చక్రవర్తి తో చేసారు, బహుశా భారతీయ సినీ చరిత్రలో ఇది ఒక రికార్డు అని చెప్ప వచ్చు. తెలుగులో 35 సినిమాలు డైరెక్ట్ చేసిన ప్రసాద్ గారు తెలుగు పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వెళ్లి పోయాక సినిమాలు లేక ఖాళీగా ఉండి పోయారు. ఓ రోజు ఫ్లైట్ లో కలసిన హిందీ నిర్మాత కే.సి.బొకాడియా గారు ఆయనకు అభయం ఇచ్చి, ఆయన ప్రొడక్షన్ లో కొన్నిసినిమాలకు కో- డైరెక్టర్ గ పని చేసిన తరువాత 1992 లో” జనతా కి అదాలత్” అనే సినిమా తో ప్రసాద్ గారిని డైరెక్టర్ చేసారు, అందులో మిదున్ చక్రవర్తి హీరో గ నటించారు.
హిందీ సినిమా నిర్మాణం చేయటానికి 2 నుంచి 3 సంవత్సరాలు తీసుకొంటున్న రోజుల్లో,” జనతా కి అదాలత్” సినిమా ఒక నెల రోజుల్లో పూర్తి చేసారు, ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అంతే హిందీ నిర్మాతల దృష్టి ప్రసాద్ గారి మీద పడింది, నిర్మాత ఎవరయినా, దర్శకుడు ప్రసాద్, హీరో మిదున్ చక్రవర్తి ఆలా వరుస సినిమాలతో చెలరేగిపోయారు ప్రసాద్ గారు. మిదున్ చక్రవర్తి తో 30 సినిమాలు చేసారు దాదాపుగా అన్ని సూపర్ హిట్, బెంగాలీ లో కూడా మిథున్ చక్రవర్తి హీరో గ సినిమా చేసారు టి.ఎల్.వి. ప్రసాద్ గారు. ఒకే హీరో తో 30 సినిమాలు చేసి లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు ప్రసాద్ గారు.