7
భారతదేశ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన ఇద్దరు పోరాట యోధులు, మన్యం ప్రజల కోసం పోరాడిన ధీరులు అయిన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలను తన సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు. ఈ వీరులకు కల్పిత కథను జతచేసి ఓ అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం రామరాజు పాత్రలో రామ్ చరణ్‌ను పరిచయం చేయగా.. ఇప్పుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ను పరిచయం చేసారు. ఈ టీజర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇదిలా ఉంటె తాజాగా చిత్ర యూనిట్ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసారు.
కొద్ది రోజులుగా నైట్ షెడ్యూల్ జరుపుకుంటుంది. చలికి వణుక్కుంటూ మరీ షూటింగ్ చేసి ఆర్ఆర్ఆర్ టీం ఈ షెడ్యూల్‌కు ప్యాకప్ చెప్పింది. చలకాలపు రాత్రులకు గుడ్ బై.. దాదాపు 50 రోజుల నైట్ షూట్ పూర్తి చేశాం అని తెలిపింది. ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ మహాబలేశ్వరం వద్ద ప్లాన్ చేశారు. ఇక్కడి ప్రకృతి అందాల మధ్య కొన్ని సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. మూవింగ్ క్రేన్ షాట్లు, డ్రోన్ షాట్లు తీసినట్టు తెలుస్తోంది. చుట్టూపక్కల అంతా కూడా అందంగా కనిపిస్తుందంటూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ ట్విట్టర్ వీడియో చేసింది.