టాలెంటెడ్ తమిళ యాక్ట్రెస్ నివేత పేతురాజ్ సక్సెస్ ఫుల్ “మెంటల్ మదిలో “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “చిత్రలహరి “, “బ్రోచేవారెవరురా “, “అల .. వైకుంఠపురములో .. ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నివేత నటించిన రెండు తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. హీరో రామ్ కు జోడీగా నివేత నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
“ప్రస్థానం “మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న పొలిటికల్ డ్రామా లో నివేత కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పుడు నివేత మరో తెలుగు మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. లక్కీ మీడియా బ్యానర్ పై సూపర్ హిట్ “HIT ” మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “పాగల్ ” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో సిమ్రాన్ చౌదరి ఒక కథానాయిక కాగా మరో కథానాయికగా నివేత ఎంపిక అయ్యారు.