ఒక సినిమాని చేసేముందు దర్శకనిర్మాతలు చాలా అనుకుంటారు.. అందులో కొన్ని స్క్రిప్ట్ దశలోనే మెరుగులు దిద్దుకుంటే మరికొన్ని మాత్రం చిత్రీకరణ దశలో మెరుగులు దిద్దుకుంటాయి.. ఇక ఇలాంటివి స్టార్ హీరోల సినిమాలో అయితే చాలానే అని చెప్పాలి.. సరిగ్గా మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా విషయంలోనూ ఇదే జరిగింది.. సినిమాలో భాగంగా వచ్చే ఇంటర్వెల్ బ్యాక్‌డ్రాప్ కోసం షేర్‌ఖాన్ అనే పాత్రను సృష్టించింరట రచయితలు.. కేవలం ఇదు నిమిషాల పాత్ర మాత్రమే ఇది ఉంటుందట.. అయితే ఆ పాత్ర ఇంటర్వెల్ ముందు వచ్చి ”నరసింహారెడ్డి, నీ లాంటివాడు దేశానికి కావాలి’ అంటూ నరసింహ రెడ్డి చేతిలోని కత్తి తీసుకుని పొడుచుకుని చనిపోతుందట..
దీనిని ముందుగా బాలీవుడ్ స్టార్స్ సల్మాన్‌ఖాన్, సంజయ్ దత్ లలో ఎవరిలో ఒకరితో అయిన చేయించాలని అనుకున్నారట.. కానీ వారి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో దానిని వదులుకున్నారట.. దీనితో ఒకనొక దశలో చిరు తనయుడు చరణ్ తో చేయించాలని కూడా భావించారట.. కానీ తండ్రి కారణంగా కొడుకు చనిపోయే సన్నివేశాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో లేదో అని సందేహపడి ఆ పాత్రను చరణ్‌తో చేయించడానికి చిరు ఒప్పుకోలేదట.. దీనితో షేర్‌ఖాన్ అనే పాత్రకి స్క్రిప్ట్ దశలోనే కత్తెరకు పని చెప్పారట..