
టాలీవుడ్ లో సినిమాల సందడి కంటె పెళ్లి సందడి ఎక్కువైంది..హీరోలు నితిన్, నిఖిల్, ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ సుజీత్ కుమార్ వీళ్లందరు తమ బ్యాచ్లర్ లైఫ్ కు స్వస్తి చెప్పి ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. వీళ్ళ సరసన ఇప్పుడు టాలీవుడ్ నుండి ఓ ప్రముఖ హీరోయిన్ కూడా జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది..టాలీవుడ్ చందమామ కాజల్ పెళ్లి వార్త మరోసారి ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఔరంగాబాద్కి చెందిన ఓ పారిశ్రామికవేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇప్పుడో వార్త తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరి వివాహానికి సంబంధించి ఇరు వర్గాల కుటుంబసభ్యులు మాట్లాడుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు కూడా సమాచారం.

