
సీనియర్ నటుడు సుధాకర్, అంటే శుభలేఖ సుధాకర్ గారు తన మొదటి సినిమాని ఇంటి పేరుగా చేసుకున్న కొద్దిమంది నటులలో ఆయన ఒకరు. అసలు అయన సప్తపది సుధాకర్ అవ్వవలసింది శుభలేఖ సుధాకర్ అయ్యారు. సుధాకర్ గారు ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఫస్ట్ విశ్వనాధ్ గారిని సప్తపది సినిమా లో వేషం కోసం కలిశారు కానీ కారణం తెలియదు కానీ సుధాకర్ ఆ క్యారెక్టర్ కు సెలెక్ట్ కాలేదు , సప్తపది కి శుభలేఖ కు రెండేళ్లు గ్యాప్ ఉంది మరి ఈ రెండేళ్లు సుధాకర్ గారు ఎం చేసారు? తాజ్ హోటల్ లో క్యాషియర్ గ ఆ తరువాత సుధాకర్ గారి గురించి తెలిసిన వారి మేనేజర్ సుధాకర్ గారిని రిసెప్షనిస్ట్ గ వేశారు , ఎందుకంటే అయన మంచి ఇంగ్లీష్ మాట్లాడటం ఒక ప్లస్ పాయింట్ అయితే , రెండవది అక్కడకి చాలామంది సినిమా వాళ్ళు వస్తుంటారు కాబట్టి అదేమయిన సుధాకర్ గారికి ఉపయోగ పడుతుందేమోనని.ఆ తరువాత కొద్దీ రోజులకు విశ్వనాధ్ గారి నుంచి పిలుపు రావటం శుభలేఖ చిత్రం లో నటించటం జరిగింది. ఆ విధంగా సప్తపది సుధాకర్ అనిపించుకోవాల్సిన సుధాకర్ గారు , తాజ్ సుధాకర్ గ కొద్ది రోజులు గడిపి శుభలేఖ సుధాకర్ అయ్యారు.ఆయన తరువాత చాల కాలానికి ద్రోహి అనే మూవీ లో విలన్ రోల్ చేసారు అందులో వారి నటన వెన్నులో చలి పుట్టిస్తుంది అంత క్రుయాలిటీ చూపించారు దీని తరువాత ఇటువంటి పాత్రలు చేసి ద్రోహి సుధాకర్ అవుతారు అనుకున్న , కానీ శుభలేఖ సుధాకర్ గానే కంటిన్యూ అవుతున్నారు.
					
					
