ప్రముఖ యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. నల్లకుంటకు శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ప్రముఖ తెలుగు టీవీ చానెల్‌లో శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించిన ఓ షోలో బ్రాహ్మణులను కించపరిచినట్టు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ శర్మ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. శర్మ ఫిర్యాదు మేరకు శ్రీముఖితోపాటు, జెమిని టీవీ యాజమాన్యంపై పోలీసులుకు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.