సీతారామరాజు గారు జీవితాన్ని ఆధారం చేసుకుని సినిమా తీద్దామని ముందుగా ఎన్టీఆర్ గారు భావించారు, దాన్ని తీయడంలో అనేక తర్జనభర్జనలు జరగడంతో ఎన్టీఆర్ గారు ఈ సినిమాను ను వదిలేయక తప్పలేదు.. దాంతో కృష్ణ గారు ఈ సినిమాను చేసారు.. చిత్తూరు జిల్లాలోని హార్సిలీ హిల్స్ ప్రాంతంలో ఎక్కువ భాగం చిత్రీకరించారు. అయితే కొంత సినిమా తీశాకా డైరెక్టర్ రామచంద్రరావు గారు అనారోగ్యంతో మరణించడంతో సినిమా చిత్రీకరణ ఆగింది. కృష్ణ గరే మిగిలిన చిత్రానికి దర్శకత్వం వహించి,సూచించి, కె.ఎస్.ఆర్.దాస్ను దర్శకత్వంలో పోరాట దృశ్యాలను తీయడంతో. సినిమా పూర్తైంది. ఈ సినిమాను కేవలం 10 లక్షల బడ్జెట్ తో మాత్రమే నిర్మించారు అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కానీ అక్షరాల ఇది నిజం. 60 రోజుల్లో పక్కా ప్లానింగ్‌తో ఈ చిత్రాన్ని పద్మాలయా సంస్థ నిర్మించింది.
అల్లూరి సీతారామరాజు సినిమాను కలర్ సినిమాస్కోప్ లో చిత్రీకరించారు, ఇది తెలుగులో మొట్టమొదటి కలర్ స్కోప్ సినిమాగా నిలిచింది..పూర్తి స్థాయి ఇంగ్లీషు పాట ఉన్న తొలి (తెలుగు) చిత్రం ఇదే. ఈ పాట ఆదినారాయణరావు రాయటం విశేషం. ఈ సినిమా భారీ విజయాన్ని చవిచూసి, 19 కేంద్రాలలో 100రోజులు నడిచింది. సినిమాని ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే పేరుతో హిందీలోకి అనువదించారు. ఈ సినిమాకు 1974 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు, “తెలుగు వీర లేవరా” పాటకై శ్రీశ్రీ గారికి జాతీయ ఉత్తమ సినీ గీత రచయితగా పురస్కారం దక్కింది. అంతే కాకుండా ఆఫ్రో – ఏషియన్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడి బహుమతిని అందుకుంది.