in

actors who played doctors!

టాలీవుడ్ లో డాక్టర్‌ పాత్రలు అందరూ చేయరు. ఎందుకంటే డాక్టర్‌ ‘మాస్‌’గా ఉండడని మన అభిప్రాయం..అయినా కానీ డాక్టర్ పాత్రా చేసి తెలుగు ప్రేక్షకుల అభినందనలు పొందిన కొందరు రీల్ లైఫ్ డాక్టర్స్ పైన ఒక లుక్ వేద్దాం రండి.

NANI IN DEVADAS

నాచురల్ స్టార్ నాని ఇటీవలే ‘దేవదాస్’ అనే మల్టీ స్టార్రర్ సినిమాలో డాక్టర్ పాత్రా చేసి అలరించారు. ఎంతో కష్టపడి ఒక పెద్ద హాస్పిటల్ లో డాక్టర్ గ చేరుతాడు దాస్, ప్రజలంతా తమ ఆర్గాన్స్ ను డొనేట్ చేయాలి. మనం చనిపోయిన కూడా మన ఆర్గాన్స్ బ్రతుకున్న వారికి చాల ఉపయోగపడుతాయి..అనే విషయాన్నీ తెలియచేసింది ఈ సినిమా.

NAGARJUNA IN SOGGADE CHINNI NAYANA

})(jQuery);

నాగార్జున గారు కూడా డాక్టర్ పాత్రా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ‘డాక్టర్స్ రాత్రి, పగలు, అనే తేడా లేకుండా పేషెంట్స్ ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు, పేషెంట్స్ ఫ్యామిలీ లో వెలుగు నింపడానికి..డాక్టర్స్ తమ ఫ్యామిలీ తో దూరం గ ఉండి ఇంట్లో ఎలాంటి పరిస్థితుల్ని ఎదురుకుంటున్నారు’ అనే విషయాలు కళ్ళకు కట్టినట్టు చూపించింది ఈ సినిమా.

BALAKRISHNA IN SIMHA

బాలయ్య బాబు గారు కూడా డాక్టర్ పాత్రలో మెప్పించారు, డబ్బు లేక..సరైన వైద్యం చేయించుకోలేక పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు చూపించింది ఈ సినిమా

CHIRANJEEVI IN  SHANKAR DADA MBBS

మెగా స్టార్ చిరంజీవి గారు కూడా డాక్టర్ పాత్రా చేసి తన కెరీర్ లో ఒక మంచి విజయాన్ని అందుకున్నారు. “డాక్టర్లు పేషెంట్లను ఫీజు కట్టే ఒక మెషీన్‌లా చూస్తున్నారని వైద్యం కంటే ముందు డాక్టర్ల నుంచి కావాల్సింది ప్రేమ, ఆదరణ, నమ్మకం, భరోసా” అని శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్‌ మనకు చెప్పాడు.

VIJAY DEVARAKONDA IN ARJUN REDDY

క ఇటీవల సంచలనం సృష్టించిన డాక్టర్‌ ‘అర్జున్‌ రెడ్డి’. ఈ సినిమాలో అర్జున్‌ రెడ్డిగా నటించిన విజయ్‌ దేవరకొండ ఒక గొప్ప ఆర్థోపెడిస్ట్‌ సర్జన్‌గా కనిపిస్తాడు. తన ప్రేమ పట్ల ఎంత నిజాయితీగా ఉంటాడో వృత్తి పట్ల కూడా అంత నిజాయితీగా ఉంటాడు. దేవదాసుగా మారి తాగి హాస్పిటల్‌కు వచ్చి సర్జరీలు చేస్తుంటాడు. అలా చేయడం తప్పు. ఎంక్వయిరీ వచ్చినప్పుడు అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు. కాని నిజాయతీ గా తన తప్పు అంగీకరిస్తాడు