RRR చిత్రం గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన తర్వాత రాంచరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు వెళ్ళిపోయింది. అదే ఆయన్ని అంతర్జాతీయ వేదికల వరకూ తీసుకెళ్ళింది.. గ్లోబల్ స్టార్ గా మార్చేసింది. రామారాజుగా ఆయన నటనకు పలువురు హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. నాటు నాటు స్టెప్పులకు వెస్టర్న్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలో పలు ఇంటర్నేషనల్ అవార్డుల స్టేజీల మీద మెరిసిన చెర్రీ.. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వరించడంతో ప్రతిష్టాత్మక అకాడెమీ పురస్కారాల్లోనూ భాగమయ్యాడు..
కొణిదెల చిరంజీవి, సురేఖ దంపతులకు మూడో సంతానంగా 1985 మార్చి 27న మద్రాస్ లో జన్మించారు రామ్ చరణ్. అందరూ ముద్దుగా చెర్రీ అని పిలుస్తుంటారు. మొదట చెన్నైలో స్కూలింగ్ చేసిన ఆయన.. ఆ తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సెయింట్ మేరీస్ కాలేజీలలో చదువు కొనసాగింది. తండ్రితో పాటుగా బాబాయిలు కూడా హీరోలుగా నటిస్తుండటం, మరోవైపు తన అమ్మ తరపు ఫ్యామిలీ కూడా ఇండస్ట్రీలో ఉండటంతో.. చిన్నప్పటి నుంచే చరణ్ కు సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ముంబైలోని కిశోర్ నమిత్ కపూర్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకున్నాడు..
దాదాపు 16 ఏళ్ల సినీ కెరీర్ లో రామ్ చరణ్ ఎన్నో హిట్లు అందుకున్నాడు.. పరాజయాలు కూడా చవిచూశాడు. అయినప్పటికీ కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో పలు అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నాడు. రెండు నంది అవార్డులతో పాటుగా మూడు ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. RRR చిత్రానికి గాను క్రిటిక్స్ చాయిస్ సూపర్ అవార్డుతో పాటుగా, హలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్ లైట్ అవార్డ్ అందుకున్నాడు చెర్రీ. ఇప్పుడు ‘గేమ్ చెంజర్’, బుచ్చి బాబు తో RC16 ఇంకా రంగస్థలం డైరెక్టర్ సుకుమార్ తో కలిసి RC17 తో మళ్ళి మన ముందుకు రాబోతున్నారు!!