
హీరోయిన్ జయప్రద గారి అసలు పేరు లలిత కుమారి, జయప్రద గ ఎలా మారింది తెలుసుకోవాలి అని ఉందా? అయితే ఈ స్టోరీ చదవండి. లలిత కుమారి సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో కే.బి.తిలక్ గారు ఆమెకు తాను నిర్మిస్తున్న భూమి కోసం అనే సినిమా లో ఒక చిన్న రోల్ ఇచ్చి రంగ ప్రవేశం చేయించారు.నటుడు, నిర్మాత అయినా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, జయప్రద ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో సినిమా నిర్మిస్తున్నారు, ఆ సినిమా పేరు” నాకు స్వతంత్రం వచ్చింది” అందులో ఒక క్యారెక్టర్ కోసం లలిత కుమారి ని తీసుకొన్నారు. కానీ పేరు పాత కాలం పేరు లాగా ఉంది అని తమ ప్రొడక్షన్ హౌస్ పేరునే ఆమెకు పెట్టారు, ఆలా లలిత కుమారి కాస్త జయప్రద గ మారిపోయారు, మారిపోవటమే కాదు తన కెరీర్ ను జయప్రదంగా కొనసాగించారు.

