
మెగా స్టార్ చిరంజీవి గారికి తన ఇద్దరు తమ్ములు అంటే ఎంత ప్రేమో మనందరికీ తెలిసిన విషయమే. అయితే వారి చిన్నతనంలో చిరంజీవి గారు నాగ బాబు గారిని ఒకసారి బాగా కొట్టారన్న విషయం మీకు తెలుసా. మీరు మీ తమ్ముల మీద ఎప్పుడైనా చెయ్యి చేసుకున్నారా ?అని ఒక సందర్భంలో చిరంజీవి గారిని ఇంటర్వ్యూ లొ అడుగుతే దానికి బదులుగా ఇలా సమాధానం చెప్పారు. ” నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా రోజులవి, ఒకనాడు నాకు ఉదయాన్నే లాండ్రీ కి వెళ్లే మా బట్టలు తీసుకరావడం ఇంక బైట ఒక అర్జెంట్ పని రెండు పనులు చేయాల్సి వచ్చింది. అయితే నేను నాగ బాబు ని నువ్వు లాండ్రీ కి వెళ్లి బట్టలు తీసుకురా అని చెప్పా, సాయంత్రం నేను బైట పని పూర్తి చేసుకొని వచ్చాక ఏరా బట్టలు తెచ్చావా అని అడిగాను. దానికి సమాధానంగా తేలేదు నిద్రపోయాను అని నాగ బాబు అన్నాడు. ఆ మాటతో చాల కోపం వచ్చి నాగ బాబు ని బాగా కొట్టేసాను. ఇంక ఆరోజంతా మా ఇంట్లో అమ్మ నాన్న నాతో సరిగ్గా మాట్లాడలేదు” అంటూ చిన్ననాటి సంగతులను గుర్తుచేసుకున్నారు చిరు.
 
					 
					
