
రాజమౌళి గారు బాహుబలి సినిమా లొ ఉన్న ముఖ్య పాత్రలకి ఎవరు బాగా సూట్ అవుతారో ముందే ప్లాన్ చేసుకొని వారికీ బడ్జెట్ ఫిక్స్ చేశారట. అన్ని అనుకున్నట్లుగానే అందరూ సినిమా కి ఓకే చెప్పారు. అయితే, శివగామి పాత్రా కి ముందుగా రమ్య కృష్ణ ని ఓకే చేసారు అంట, కానీ సినిమా హిందీ లొ మార్కెట్ పెంచడానికి శ్రీ దేవి ని తీసుకుందాం అనుకున్నారు రాజమౌళి, ఆవిడ దాదాపు 7 కోట్ల రెమ్యూనరేషన్ కావాలి అందంట. దానికి సరే అనుకున్నారు రాజమౌళి. తరువాత శ్రీ దేవి గారు అదే కాకుండా షూటింగ్ అయిపోయాక కాస్ట్లీ హోటల్స్ సదుపాయాలు ఇంక హిందీ లొ షేర్ కూడా కావాలి అనడంతో ఇంక శ్రీ దేవి ని పక్కకి పెట్టేశారంట. బాహుబలి రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. శివగామిగా చేసిన రమ్య కృష్ణ కి ప్రేక్షకులు సెల్యూట్ చేయక తప్పలేదు. శ్రీ దేవి గారిని తీసుకోకపోవడమే మంచిదైంది’ ఆవిడ నో చెప్పడం మా అదృష్టం అంటూ నోరు జారారు రాజమౌళి గారు. ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లొ చెప్పడం జరిగింది. రమ్య కృష్ణ గారు బాగా చేసారు కానీ శ్రీ దేవి గారిని తక్కువ చేసి మాట్లాడినందుకు అప్పట్లో రాజమౌళి గారి మీద కూడా చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఏది ఏమైనప్పటికి అతిలోక సుందరి శ్రీ దేవి గారిని ఓపెన్ గ ఆలా అనడం తప్పే అంటున్నారు సినీ అభిమానులు.

