అన్నయ్య చిరంజీవి తమ్ముడిగా 90’s లొ సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన మెగా బ్రదర్ నాగ బాబు గారు, అప్పటినుండే వచ్చిన క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీ లొ తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని ఐనా విధి అనేది వదలదు కదా, దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ నాగ బాబు గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన, ఆ సంఘటన ఆయనని చావు అంచుల దాక తీసుకెళ్లింది. నాగ బాబు గారు ప్రొడ్యూసర్ గ దాదాపు 40 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా ‘ఆరంజ్’. ఆ సినిమా బాక్స్ -ఆఫీస్ వద్ద గోరంగా ప్లాప్ అవ్వడంతో మొత్తం అప్పులు భారిన పడాల్సి వచ్చింది.
ఎవరికి చెప్పలేక దిక్కు తోచని స్థితికి చేరుకున్న ఆయన ఆత్మ హత్యా చేసుకుందాం అని కూడా ఆలోచన చేశారట, ఇలాంటి క్షోభ నా శత్రువుకి కూడా రాకూడదు అంటూ దేవుడిని వేడుకున్నారు అంట. కొంత కాలానికి విషయం ఆ నోటా ఈ నోటా బైటికి పొక్కడంతో, ముందు తన తమ్ముడు కళ్యాణ్ బాబు కాల్ చేసి ‘ఏం దిగులు పడకు అన్నయ్య నేను చూసుకుంటాను ‘ అని చెప్పారట, రెండు రోజుల తరువాత అన్నయ్య చిరంజీవి కాల్ చేసి ‘ వదిలేయి ర పోనీ పర్వాలేదు ‘ అంటూ దైర్యం చెప్పారట. తరువాత కొంత కాలానికి ఆ ఇద్దరు కలిసి నాగ బాబు గారికి ఎంత అప్పు ఉందొ తెలుసుకొని మొత్తం తీర్చేయడం జరిగింది, దాని తరువాత జీవితంలో మళ్లీ ఎవరి దగ్గర అప్పు చేయలేదంట మెగా బ్రదర్ నాగ బాబు. ఈ విషయాన్నీ నాగ బాబు గారు స్వయానా ఆయనే 2014 లొ ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లొ చెప్పడం జరిగింది, నిజంగా నాగ బాబు గారికి అలంటి బ్రదర్స్ ఉండటం ఆయన అదృష్టం కదా.