in

AVS ne addam lo moham chusko ani chepina Bapu!

మంచి వెంకట సుబ్రహ్మణ్యం, ఏ.వి.ఎస్. గ ప్రేక్షకులకు సుపరిచితుడు, అయన తెర మీద కనిపించగానే ప్రేక్షకుల ముఖం లో నవ్వు మెరుస్తుంది, తెలుగు చిత్ర సీమ లో దాదాపుగ ఒక వంద మంది కమెడియన్స్ లో ఒకడిగా, తనకు అంటూ ఒక ప్రత్యేక శైలి తో, ఈ క్యారెక్టర్ ఏ.వి.ఎస్ అయితే బాగుంటుంది అనే విధంగ అయన సినీ ప్రయాణం సాగింది. కాలేజీ రోజుల నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్ గ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఏ.వి.ఎస్ ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర్ రావు గారు ఏ.వి.ఎస్ గారికి మామ వరుస అవుతారు. ఎప్పుడయినా ఘంటసాల గారు తెనాలి వస్తే ఏ.వి.ఎస్ గారి ఇంటికి వచ్చే వారు వారిని చూడటానికి జనం విపరీతంగా రావటం చుసిన ఏ.వి.ఎస్ గారికి తాను కూడా సినీ నటుడు అవ్వాలనే కోరిక కలిగింది. ఇక తెనాలి నుండి మద్రాస్ చేరారు, బాపు గారి ఇంటికి వెళ్లారు నేరుగా, తన పని ఒత్తిడి లో ఉన్న బాపు గారు ఏ.వి.ఎస్ ను చూసి నటుడు అవుదామని వచ్చావా ఎప్పోడైన అద్దం లో ముఖం చూసుకున్నావా అని వెళ్లిపోయారు.విపరీతం అయినా నిస్పృహ లోనయిన ఏ.వి.ఎస్ గారు తిరిగి తెనాలి చేరుకొని సినిమా ఆలోచన ప్రక్కన పెట్టి, ఆంధ్రజ్యోతి లో జర్నలిస్ట్ గ జాయిన్ అయ్యారు, వృత్హి తో పాటు తన మిమిక్రీ ని కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు, అనుకోకుండా ముళ్ళపూడి రమణ గారి తో పరిచయం, వీరి మిమిక్రి వారికీ నచ్చటం జరిగింది. ఏ.వి.ఎస్ గారు నిజ జీవితం లో వ్యక్తులను గమనించి వారిని కూడా అనుకరిస్తుండే వారు. బాపు, రమణ గారు విశ్వనాథ కవి సార్వభౌమ లో ఒక పాత్ర ఇచ్చారు, దాని తరువాత వారు నిర్మిస్తున్న మిస్టర్ పెళ్ళాం అనే చిత్రం లో గోపాల్ అనే పాత్రధారి కి ఏదైనా ఒక మేనరిజం పెడితే బాగుంటుంది అనుకున్న రమణ గారు ఏ.వి.ఎస్ కు ఫోన్ చేసి విషయం చెప్పగానే ఏ.వి.ఎస్. గారు ఫోన్ లోనే న్తతి గ మాట్లాడి చూపించారు నచ్చిన రమణ గారు బాపు గారికి కూడా వినిపించి గోపాల్ క్యారెక్టర్ కి ఏ.వి.ఎస్ .గారిని తీసుకోవటం జరిగింది. ఆ తరువాత” తుత్తి “అంటూ ఆయన చెప్పిన డైలాగు తో అయన యెంత పాపులర్ అయ్యారో ఆయన డైలాగ్ కూడా జనం నోళ్ళలో బాగా నానింది. 12 సంవత్సరాల క్రితం నీ ముఖం అద్దం లో చూసుకున్నావా అన్న బాపు గారే అయన నటుడిగా అవకాశం ఇవ్వటమే కాకా బాపు గారి ప్రతి సినిమా లో ఏ.వి.ఎస్ పెర్మనెంట్ ఆర్టిస్ట్ అయ్యారు. వారు మన మధ్య లేక పోయిన వారు పంచిన నవ్వుల తాలూకు “తుత్తి” ఎప్పటికి మిగిలి ఉంటుంది.

KGF stunt masters for balayya!

Only a True Chay Fan can guess all questions correct?